నన్నయలో డ్యాన్స్‌ కోర్సులకు ప్రణాళిక : వీసీ

ABN , First Publish Date - 2022-05-14T06:14:56+05:30 IST

ఆదికవి నన్నయ వర్శిటీలో డ్యాన్స్‌ కోర్సులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని వీసీ మొక్కా జగన్నాథరావు ఆదేశించారు.

నన్నయలో డ్యాన్స్‌ కోర్సులకు ప్రణాళిక : వీసీ
సమావేశంలో మాట్లాడుతున్న నన్నయ వీసీ జగన్నాథరావు

దివాన్‌చెరువు, మే 13 : ఆదికవి నన్నయ వర్శిటీలో డ్యాన్స్‌ కోర్సులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని వీసీ మొక్కా జగన్నాథరావు  ఆదేశించారు.వర్శిటీలో డ్యాన్స్‌ కోర్సుల ఏర్పాటుపై శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. డాన్స్‌ పీజీ డిప్లమో కోర్సులు, సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూ పొందించాలన్నారు.నృత్య సంబంధిత కోర్సుల పాఠ్యప్రణాళికలను సిద్ధం చేయా లని అధికా రులను,లలితకళల అధ్యాపకురాలు కె.రాజరాజేశ్వరీదేవిని ఆదేశించారు.కార్యక్రమం లో రిజి స్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌, ఓఎస్‌డీ ఆచార్య ఎస్‌.టేకి, ప్రిన్సిపాల్స్‌ కె.సుబ్బారావు, కె.రమణేశ్వరి, వి.పెర్సిస్‌, తెలుగుశాఖ సహాయాచార్యుడు తలారి వాసు తదితరులు పాల్గొన్నారు.


Read more