-
-
Home » Andhra Pradesh » East Godavari » minister-NGTS-AndhraPradesh
-
మంత్రే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి
ABN , First Publish Date - 2022-05-14T06:22:45+05:30 IST
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనకు తీరని అన్యాయం చేస్తున్నారని పట్టణానికి చెందిన భైరిశెట్టి రేణుక ఆరోపించారు.
బాధితురాలు రేణుక
అమలాపురంటౌన్, మే 13: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనకు తీరని అన్యాయం చేస్తున్నారని పట్టణానికి చెందిన భైరిశెట్టి రేణుక ఆరోపించారు. నాకేమైనా జరిగితే అందుకు మం త్రే బాధ్యత వహించాల్సి ఉంటుంద న్నారు. న్యాయం చేయాల్సిన మంత్రి అన్యాయం చేసిన వారి పక్షాన ఉండడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించా రు. మంత్రి వేణు అన్యాయం చేస్తుంటే జిల్లా పర్యటన కు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి తన గోడు తెలపాలని భావిస్తే పోలీసులు శుక్రవారం ఉదయమే తనను గృహ నిబ్బంధం చేశారని బోరున విలపిస్తూ విలేకరులకు తెలిపింది. అమలాపురం పట్టణానికి చెం దిన వైసీపీ నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాస్ కుమా రుడు, తాను ప్రేమించుకున్నామని, తమ వివాహం జరగకుండా అడ్డుకున్నారని వాపోయింది. నాలుగు రో జుల క్రితం అమలా పురం వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ ప్రముఖులకు తన ఆవేదన తెలిపానంది. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యా యం జరగ కూడదని ముఖ్యమంత్రి జగన్ చెప్తారు. మరి ఆ పార్టీ మంత్రే అన్యాయం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి అని వాపోయింది. వేణుతో పాటు చెల్లుబోయిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తనకు నరకం చూపిస్తున్నారంది. తాను ఆత్మహత్య చేసుకుంటే అందుకు వారే బాధ్యులని లేఖరాసి చనిపోతానంది. శ్రీనివాస్ కుమా రునిపై కేసులు ఉండగా దొంగ పాస్‌పోర్టుతో లండన్‌కు పంపించడం దారుణమన్నారు. తనలా ఏ ఆడపిల్లా బాధపడకూడదని, తక్షణం ముఖ్యమంత్రి జగన్ తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని రేణుక వేడుకుంది.

