-
-
Home » Andhra Pradesh » East Godavari » ma sanskruti programe pitapuram-NGTS-AndhraPradesh
-
రేపు ‘మన సంస్కృతి ప్రహేళిక’
ABN , First Publish Date - 2022-05-14T05:31:47+05:30 IST
పిఠాపురం, మే 13: పట్టణంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఈ నెల 15న ఉదయం 9గంటలకు మనము మన సంస్కృతి ప్రహేళిక(క్వి
పిఠాపురం, మే 13: పట్టణంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఈ నెల 15న ఉదయం 9గంటలకు మనము మన సంస్కృతి ప్రహేళిక(క్విజ్) నిర్వహిస్తున్నట్టు గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకరరావు తెలిపారు. రామాయణం, మహాభారత గ్రంథాలను అనుసరించి వాటిలోని విషయాలపై ప్రశ్నావళితో క్విజ్ నిర్వహిస్తామన్నారు. 8,9,10వ తరగతుల విద్యార్థులు అర్హులని, క్విజ్ సమయానికి అరగంట ముందుగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

