వెబ్‌ పోర్టల్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-14T05:33:39+05:30 IST

జేఎన్టీయూకే, మే 13: వర్సిటీ వీసీ సమావేశహాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ అకడమిక్‌ ఆడిట్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌ పోర్టల్‌ను ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ అకడమిక్‌ ఆడిట్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా అనుబంధ కళాశాలలతో అనుసంధానమై ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవచ్చన్నారు. జేఎన్టీయూకేను పరిశోధనా విశ్వవిద్యాలయం

వెబ్‌ పోర్టల్‌ ప్రారంభం

జేఎన్టీయూకే, మే 13: వర్సిటీ వీసీ సమావేశహాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ అకడమిక్‌ ఆడిట్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌ పోర్టల్‌ను ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ అకడమిక్‌ ఆడిట్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా అనుబంధ కళాశాలలతో అనుసంధానమై ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవచ్చన్నారు. జేఎన్టీయూకేను పరిశోధనా విశ్వవిద్యాలయంగా రూపొందించేలా కృషి చేస్తున్నామన్నారు. ఈవెబ్‌ పోర్టల్‌ ద్వారా పాఠ్యప్రణాళిక, పరీక్షల టైంటేబుల్‌, ప్లేస్‌మెంట్స్‌, యూజీ,పీజీ కోర్సుల వివరాలు పొందుపరుస్తామన్నారు. పరీక్షల విభాగంలో తత్కాల్‌ విధానంలో పీసీ, ఓడీలను త్వరితగతిన ఇచ్చేలా తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత, అకడమిక్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ సాయిబాబు, డీఈ బాలకృష్ణ, డైరెక్టర్‌ వి.రవీంద్ర పాల్గొన్నారు.

Read more