ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇంటర్‌ పరీక్షకు 94.93 శాతం హాజరు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-05-14T06:52:33+05:30

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సర పరీక్షలను జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

కొవ్వూరు అల్లూరి నాగరత్నం జడ్పీ స్కూల్‌లో ఇంటర్‌ పరీక్షలను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కొవ్వూరు, మే 13 : ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సర పరీక్షలను జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి, ఇన్విజిలేటర్లకు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య శిబిరంలో మందులను పరిశీలించారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం గణితం పేపర్‌ 1బి, చరిత్ర పేపర్‌1, జువాలజీ పేపర్‌1 పరీక్షలకు 14165, ఒకేషనల్‌ 1766 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సర పరీక్షలకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల్లో 14521 మంది, ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించి 2050 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లోని 32 పరీక్షా కేంద్రాల్లో 10692 మందికిగాను 10489 మంది హా జరవ్వగా, 212 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌ కోర్సుకు సంబంధిం చి 1057 మంది హాజరవ్వగా, 169 మంది గైర్హాజరయ్యారన్నారు. కొవ్వూరు డివిజన్‌లోని 17 పరీక్షా కేంద్రాల్లో 3685 మంది హాజరవ్వగా, 144 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌ కోర్సుకు 709 మంది హాజరవ్వగా, 115 మంది గైర్హాజరయ్యారన్నారు. కలెక్టర్‌ వెంట కొవ్వూరు ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, తహాశీల్దార్‌ బి. నాగరాజునాయక్‌ తదితర అధికారులు ఉన్నారు.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!