ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘పుష్ప’ సినిమా తరహాలో గంజాయి రవాణా

ABN, First Publish Date - 2022-05-10T05:59:55+05:30

పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పాలు సరఫరా చేసే ట్యాంకు అడుగు భాగంలో పెట్టి రవాణా చేసిన తరహాలో గంజాయి స్మగ్లర్లు సైతం పుష్ప చిత్రంలో మాదిరిగా ట్రాలీ వాహనం అడుగుభాగంలో గంజాయి ప్యాకెట్లను నిల్వ చేసి తరలిస్తుండగా సోమవారం తెలంగాణలోని భద్రాచలం ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పట్టుకున్న తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు
ఎటపాక, మే 9: పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పాలు సరఫరా చేసే ట్యాంకు అడుగు భాగంలో పెట్టి రవాణా చేసిన తరహాలో గంజాయి స్మగ్లర్లు సైతం పుష్ప చిత్రంలో మాదిరిగా ట్రాలీ వాహనం అడుగుభాగంలో గంజాయి ప్యాకెట్లను నిల్వ చేసి తరలిస్తుండగా సోమవారం తెలంగాణలోని భద్రాచలం ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జానయ్య ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది  పట్టణంలో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తుండగా ఎటపాక మండలంలోని చోడవరం వైపు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఒక ట్రాలీ వాహనాన్ని భద్రాచలం ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ట్రాలీ వాహనం అడుగు భాగంలో తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు.  దీంతో అధికారులు 50 ప్యాకెట్ల ఎండు గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు. అలాగే మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు, ఎటపాక మండలం  చోడవరం గ్రామానికి చెందిన ట్రాలీ కంటైనర్‌ నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన  100 కేజీల గంజాయిని స్వాధీనం  చేసుకోవడంతో పాటు గంజాయి రవాణాకు ఉపయోగించిన ట్రాలీ కంటైనర్‌ను సీజ్‌ చేసినట్లు, పట్టుబడిన గంజాయి విలువ రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు  తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!