-
-
Home » Andhra Pradesh » East Godavari » gangayi seazed police arrest-NGTS-AndhraPradesh
-
‘పుష్ప’ సినిమా తరహాలో గంజాయి రవాణా
ABN , First Publish Date - 2022-05-10T05:59:55+05:30 IST
పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పాలు సరఫరా చేసే ట్యాంకు అడుగు భాగంలో పెట్టి రవాణా చేసిన తరహాలో గంజాయి స్మగ్లర్లు సైతం పుష్ప చిత్రంలో మాదిరిగా ట్రాలీ వాహనం అడుగుభాగంలో గంజాయి ప్యాకెట్లను నిల్వ చేసి తరలిస్తుండగా సోమవారం తెలంగాణలోని భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
పట్టుకున్న తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు
ఎటపాక,
మే 9: పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పాలు సరఫరా చేసే ట్యాంకు అడుగు భాగంలో
పెట్టి రవాణా చేసిన తరహాలో గంజాయి స్మగ్లర్లు సైతం పుష్ప చిత్రంలో
మాదిరిగా ట్రాలీ వాహనం అడుగుభాగంలో గంజాయి ప్యాకెట్లను నిల్వ చేసి
తరలిస్తుండగా సోమవారం తెలంగాణలోని భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు
పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య
ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పట్టణంలో పలు చోట్ల సోదాలు
నిర్వహిస్తుండగా ఎటపాక మండలంలోని చోడవరం వైపు నుంచి భద్రాచలం వైపు
వెళ్తున్న ఒక ట్రాలీ వాహనాన్ని భద్రాచలం ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఆపి
తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ట్రాలీ వాహనం అడుగు భాగంలో తనిఖీ చేయగా
గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు 50 ప్యాకెట్ల ఎండు
గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన
ఇద్దరు యువకులు, ఎటపాక మండలం చోడవరం గ్రామానికి చెందిన ట్రాలీ కంటైనర్
నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన 100 కేజీల గంజాయిని
స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి రవాణాకు ఉపయోగించిన ట్రాలీ కంటైనర్‌ను
సీజ్ చేసినట్లు, పట్టుబడిన గంజాయి విలువ రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు
తెలిపారు.

