-
-
Home » Andhra Pradesh » East Godavari » famers awords yeruvaka centar peddapuram-NGTS-AndhraPradesh
-
రైతు పురస్కారాలకు దరఖాస్తులు
ABN , First Publish Date - 2022-05-14T05:36:37+05:30 IST
పెద్దాపురం, మే 13: ఉత్తమ రైతు పురస్కారాలకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఏరువాక కేం ద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.సీతారామశర్మ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేస్తారన్నారు. వివధ పం టల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు, అ
పెద్దాపురం, మే 13: ఉత్తమ రైతు పురస్కారాలకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.సీతారామశర్మ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేస్తారన్నారు. వివధ పం టల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు, అలాగే వినూత్న రీతిలో సాగుచేస్తున్న అభ్యుదయ, ఔత్సాహక రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. దరఖాస్తుల కోసం స్థానిక ఏరువాక కేంద్రంలో సంప్రదించాలని లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆంగ్రూ డాట్ ఏసీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను తగిన రుజువులతో ఈనెల 21లోగా కార్యాలయంలో అందచేయాలన్నారు. పూర్తి వివరాలకు 94408 56788, 9989623803లో సంప్రదించాలని ఆయన కోరారు.

