ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రైతులను మోసగించే మిల్లర్లపై చర్యలు

ABN, First Publish Date - 2022-05-14T06:09:11+05:30

ధాన్యం కొనుగోలులో రైతులను మోసగించే మిల్ల ర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె.మాధవీలత హెచ్చరించారు.

కాపవరం జగనన్న కాలనీ లేఅవుట్‌ మ్యాప్‌ పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కలెక్టర్‌ మాధవీలత హెచ్చరిక


కొవ్వూరు, మే 13 : ధాన్యం కొనుగోలులో రైతులను మోసగించే మిల్ల ర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె.మాధవీలత హెచ్చరించారు. కాపవరంలో శుక్రవారం జగనన్న లేఅవుట్‌ను, ఆర్‌బీకేను ఆకస్మిక తనిఖీ చేశారు. అసాని తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు కొంతమేర ధాన్యం తడిచిందన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు చేర్చాలన్నారు. ధాన్యం తేమశాతం విషయంలో మిల్లర్లు సహకరించాలన్నారు. కాపవరంలో 233 మంది లబ్ధిదారులకు గాను 218 మందికి ఇంటి నిర్మాణానికి ఉత్తర్వులు అం దించామన్నారు. ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులుచెల్లించడం జరుగుతుందన్నారు. 

ఉపాధి పనులను వేగవంతం చేయండి 

దేవరపల్లి, మే 13 : ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని  కలెక్టర్‌ మాధవీలత అధికారులను ఆదేశించారు. ధుమంతునిగూడెంలో శుక్రవారం ఉపాధి హామీ పనులను, జగనన్న ఇళ్ళస్థలాలను పరిశీ లించి మాట్లాడారు. వర్షాకాలం రాక ముందే ఉపాధి  పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొంత మంది ఉపాధి హామీ కూలీలు తమ అకౌంట్లలో నగదు పడడం లేదని కలెక్టర్‌ దృషికి తీసుకెళ్లగా అకౌంట్లు పూర్తయ్యేలా పరిశీలించి బ్యాంకుకు వెళ్లి అకౌంట్లలో నగదు పడిందో లేదో చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు. ధుమంతునిగూడెంలో జగనన్న ఇళ్ళ స్థలాలను మెరక చేయాలని స్థానికులు కలెక్టర్‌ను కోరగా ఆమె వెంటనే స్పందించి ఇళ్ళ స్థలాలు ప్రాంతాన్ని పరిశీలించి ఎత్తు చేసి రోడ్లు వేయాలని ఆదేశించి పదిరోజుల్లో రోడ్డు మార్గం ఏర్పాటు చేసి తనకు నివేధించాలని అన్నారు. రైతులు పండించిన ధాన్యం తడిస్తే అరబెట్టుకుని వేయాలన్నారు. అనంతరం దేవరపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఓపీ రిజిస్టర్‌, హాజరుపట్టి, వార్డులను పరిశీలించారు. కొన్ని రిజిస్టర్లు సక్రమంగా నమోదు చేయకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, డ్వామా పీడీ జగదాంబ, తహశీల్దార్లు బి.నాగరాజు నాయక్‌,ఎం.రామకృష్ణ,  ఎంపీడీవో ఉమామహే శ్వర శర్మ, హౌసింగ్‌ ఏఈ పీవీఎన్‌.సత్యప్రసాద్‌, వైద్యాధికారి సాం బశివరావు, ఎంపీటీసీ సత్తిజదీశ్వర్‌రెడ్డి, కార్యదర్శి ఆకుల లక్ష్మీనారాయణ,   తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!