ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఐ.పోలవరానికి రింగ్‌ బండ్‌

ABN, First Publish Date - 2022-05-14T06:08:20+05:30

‘కోనసీమను పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తాను. ఐ.పోలవరం మండలం దీవి చుట్టూ రింగ్‌ బండ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాను’ అని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారు.

జగనకి ఓడ నమూనా జ్ఞాపిక బహూకరిస్తున్న వైసీపీ నాయకులు. చిత్రంలో మంత్రులు విశ్వరూప్‌, వేణు, ఎమ్మెల్యేలు సతీష్‌కుమార్‌, దొరబాబు, చిట్టిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • పర్యాటకపరంగా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తా  
  • మురమళ్ల సభలో ముఖ్యమంత్రి జగన హామీ 
  • పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

అమలాపురం, మే 13(ఆంధ్రజ్యోతి): ‘కోనసీమను పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తాను. ఐ.పోలవరం మండలం దీవి చుట్టూ రింగ్‌ బండ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాను’ అని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారు. ‘మత్స్యకార భరోసా’ నాలుగో విడతను శుక్రవారం ఆయన ఐ.పోలవరం మండలం మురమళ్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ కోరిన కోర్కెలను నెరవేరుస్తానని జగన హామీ ఇచ్చారు. మండలంలో రింగ్‌ బండ్‌ నిర్మాణంతో పాటు అనాతవరంలో స్వర్గీయ పీవీ రావు ఘాట్‌ నిర్మాణానికి రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. తొలుత గోగుల్లంకకు రూ.44.50 కోట్లతో నిర్మించే వంతెన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పల్లంకుర్రు-జి.మూలపొలం మధ్య 76.9 కోట్లతో నిర్మించే వారధికి, ముమ్మిడివరం నుంచి కాట్రేనికోన వెళ్లే 9.8 కిలోమీటర్ల రహదారికి రూ.3.50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసే పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. తొలుత మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషనను మంత్రులతో కలిసి పరిశీలించారు. 

సభలో జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ కోనసీమ అంటే శివారు ప్రాంతమని, సహజవనరులు అపారంగా ఉండడం వల్ల ఈ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత పరిపాలనా సౌలభ్యం ఏర్పడి ప్రజలకు సేవలు చేరువయ్యాయన్నారు. గతంలో కోనసీమ నుంచి స్పందనకు 50 ఫిర్యాదులు వస్తే, జిల్లా ఏర్పాటయ్యాక 271కు పెరిగాయన్నారు. అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళితే అవి పరిష్కారమవుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 



కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని వినతి

అమలాపురం టౌన, మే 13: కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ శుక్రవారం ముఖ్యమంత్రి జగనకు వినతిపత్రం అందించగా సానుకూలంగా స్పందించినట్టు అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. కోనసీమలో అంబేడ్కర్‌ వాదులు ఎక్కువగా ఉన్నందున అందరి కోరిక మేరకు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను సాధన సమితి నాయకులు డీబీ లోక్‌, ఇసుకపట్ల రఘుబాబు, జంగా బాబూరావులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో         సాధన సమితి ప్రతినిధులు సరెళ్ల విజయప్రసాద్‌, నక్కా సంపతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!