వలస పక్షుల ఆవాసాలను రక్షిద్దాం : జమ్మికార్టర్‌

ABN , First Publish Date - 2022-05-14T06:15:47+05:30 IST

వలస పక్షుల ఆవాసాలను కాలుష్యం భారిన పడ కుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకృతి పక్షి ప్రేమి కురాలు జిమ్మి కార్టర్‌ అన్నారు.

వలస పక్షుల ఆవాసాలను రక్షిద్దాం : జమ్మికార్టర్‌

గోకవరం, మే 13 : వలస పక్షుల ఆవాసాలను కాలుష్యం భారిన పడ కుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకృతి పక్షి ప్రేమి కురాలు జిమ్మి కార్టర్‌ అన్నారు. గోకవరం మండలం సూదికొండ ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ వలస పక్షుల దినోత్సవంలో మాట్లాడారు. కాకినాడ డివిజన్‌లో అమూర్‌ ఫాల్కన్‌ అనే అరుదైన వలస పక్షిని గుర్తించడం జరిగింద న్నారు. ఈ పక్షి చైనా నుంచి ఆఫ్రికాకు భారతదేశం నుంచి సుదూరం పయనిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రేంజి అధికారి ఎం.కరుణాకరన్‌,సబ్‌ డివిజన్‌ అటవీ అధి కారి నిషాకుమారి, టి.రాజా, పి.వెంకట్రావు,ఈ.భూపాల్‌ పాల్గొన్నారు.

Read more