‘రాజ్యాధికారాన్ని తెచ్చుకునే సమయం ఆసన్నం’

ABN , First Publish Date - 2022-05-11T05:59:31+05:30 IST

భానుగుడి (కాకినాడ), మే 10: రాష్ట్రంలో వెనుకబడిన జాతుల వారందరూ సమైఖ్యతను చాటి రాజ్యాధికారాన్ని తెచ్చుకునే సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పంపన రామకృష్ణ, పితాని త్రినాధరావు పెర్కోన్నారు. మంగళవారం కాకినాడ సంఘం కార్యాలయంలో బీసీ కులాల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. నాయకులు మట్లాడుతూ ఇటీవల అమలాపు

‘రాజ్యాధికారాన్ని తెచ్చుకునే సమయం ఆసన్నం’

భానుగుడి (కాకినాడ), మే 10: రాష్ట్రంలో వెనుకబడిన జాతుల వారందరూ సమైఖ్యతను చాటి రాజ్యాధికారాన్ని తెచ్చుకునే సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పంపన రామకృష్ణ, పితాని త్రినాధరావు పెర్కోన్నారు. మంగళవారం కాకినాడ సంఘం కార్యాలయంలో బీసీ కులాల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. నాయకులు మట్లాడుతూ ఇటీవల అమలాపురంలో కుడుపూడి చిట్టిబ్బాయి సేవలు స్మరించుకుంటూ చేసిన కార్యక్రమంలో మంత్రి వేణు వైవీ సుబ్బారెడ్డికి ఉద్వేగపూరితమైన కృతజ్ఞతలు తెలిపినట్టు మాత్రమే సమావేశం అభిప్రాయపడిందన్నారు. సమావేశంలో నాయకులు సంసాని శ్రీనివాసరావు, పితాన్ని శ్రీనివాసరావు, బత్తిన పైడిరాజు, విరుసుమల్ల విష్ణు, గిరజాల చక్రవర్తి, తామరపల్లి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more