-
-
Home » Andhra Pradesh » East Godavari » annavaram satyadeva kalyanam-NGTS-AndhraPradesh
-
అదిగో..అరుంధతి నక్షత్రం
ABN , First Publish Date - 2022-05-14T05:57:06+05:30 IST
సత్యదేవుడు దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం అరుంధతి నక్షత్ర దర్శన కార్యక్రమం పండితులు వేడుకగా నిర్వహించారు.
అన్నవరంలో కొనసాగుతున్న కల్యాణోత్సవాలు
అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తున్న పండితులు
అన్నవరం,
మే 13: సత్యదేవుడు దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం
అరుంధతి నక్షత్ర దర్శన కార్యక్రమం పండితులు వేడుకగా నిర్వహించారు. రాత్రి 7
గంటలకు ప్రధానాలయం నుంచి నవ దంపతులను మేళతాళాలు, పండితుల మంత్రోచ్ఛరణల
నడుమ తూర్పురాజగోపురం వద్దకు తీసుకుని వచ్చారు. అన్యోన్య దాంపత్య
జీవితానికి ప్రతీక అయిన వశిష్టుడు, అరుంధతి కథను వివరించి అరుంధతి నక్షత్ర
దర్శనం చేయించారు. అంతకు ముందు సాయంత్రం 5 గంటలకు పుట్టింటి నుంచి
మెట్టినింటికి వెళ్తున్న అమ్మవారికి ప్రధాన స్థాలిపాక హోమములను
ప్రధానార్చకులు కోట శ్రీను ఆధ్వర్యంలో పండితులు ముత్య సత్యనారాయణ, పాలంకి
పట్టాభి, వేదపండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం అనంతరం హోమక్రతువును
నిర్వహించారు. చతుర్వేద పండితులు నవ దంపతులకు వేదాశీస్సులు అందజేశారు.

