-
-
Home » Andhra Pradesh » Dismissal of the case against Chintamani-NGTS-AndhraPradesh
-
చింతమనేనిపై కేసు కొట్టివేత
ABN , First Publish Date - 2022-05-14T08:28:34+05:30 IST
చింతమనేనిపై కేసు కొట్టివేత
విజయవాడ, మే 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. ప్రభాకర్‌పై ఏలూరు టూ టౌన్ పోలీ్‌సస్టేషన్‌లో 341, 352, 354, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దుగ్గిరాలకు చెందిన రాధిక 2011 మార్చిలో ఆయన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరిగారు. దీన్ని గమనించిన ఆయన అనుచరులు ఆమెను ఆపినా ఆగకుండా ఏలూరు రైల్వేస్టేషన్ వైపు వెళ్లారు. దీంతో తన ఇంటివద్ద ఎవరో మహిళ అనుమానాస్పదంగా తిరుగుతున్నారంటూ.. ప్రభాకర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి, ఆమెను పట్టుకోవడానికి వెళ్లారు. అయితే, ఏలూరు నుంచి రైలులో హైదరాబాద్ వెళ్లిన రాధిక అక్కడ చింతమనేనిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వాదోపవాదనలు విన్న ప్రజాప్రతినిధుల కోర్టు చింతమనేనిని నిర్దోషిగా తేల్చి, కేసును కొట్టి వేసింది.

