ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2022-05-14T15:16:52+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. తుఫాన్, వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, తక్షణమే రైతాంగానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల అసని తుఫాన్ వల్ల రైతులకు చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. దాదాపు ఎకరాకు రూ.50 వేల నుండి లక్ష వరకు నష్టం జరిగిందన్నారు. 2021 నవంబర్ 18 నుండి 23 వరకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి లక్షలాది ఎకరాల్లో పంట నష్టంతోపాటు 65 మందికి పైగా చనిపోయారని లేఖలో తెలిపారు. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులు తెగిపోవటం, ఇళ్లు కూలిపోవడం, వాగులు వంకలు పొంగి పొరలటం జరిగిందన్నారు. 6 మాసాలు గడిచినప్పటికీ పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పటివరకు అందలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోకపోవడం తగదన్నారు. తుఫానులు, వరదల బీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి, తగు నిధులు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!