-
-
Home » Andhra Pradesh » Commencement of Mobile Veterinary Clinics on 19th-NGTS-AndhraPradesh
-
19న మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-14T09:39:52+05:30 IST
19న మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల ప్రారంభం
అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న మొబైల్ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఆ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ దీనిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ కింద తొలి విడత 175వాహనాల ద్వారా పశుపోషకుల ఇంటి వద్దే పశువైద్య, ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు.

