ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తుఫాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2022-05-11T18:00:08+05:30

తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: రాష్ట్రంలో అసనీ(Asani) తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తుఫాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) బుధవారం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం సమీక్ష చేపట్టారు. తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమన్నారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.


ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలను తెరవాలని అన్నారు. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, జనరేటర్లు, జేసీబీలు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!