-
-
Home » Andhra Pradesh » Chittoor » Today tomorrow is the APPSC exams-NGTS-AndhraPradesh
-
నేడు, రేపు ‘ఏపీపీఎ్‌ససీ’ పరీక్షలు
ABN , First Publish Date - 2022-05-14T07:21:09+05:30 IST
ఏపీపీఎ్‌ససీ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలు శని, ఆదివారాల్లో జరగనున్నాయని డీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.
12 పరీక్ష కేంద్రాలకు హాజరుకానున్న 1017మంది అభ్యర్థులు : డీఆర్వో
తిరుపతి(కొర్లగుంట), మే 13: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎ్‌ససీ) కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలు శని, ఆదివారాల్లో జరగనున్నాయని డీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఈ పరీక్షల కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న జయశ్రీతో కలసి సెంటర్ సూపర్‌వైజర్లు, ఇన్విజిలేటర్లు, లైజన్ అఽధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎంపిక చేసిన 12 పరీక్ష కేంద్రాలకు 1017మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. శనివారం ఓ సెషన్, ఆదివారం రెండు సెషన్లు ఉంటాయన్నారు. నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాల ప్రధాన ద్వారాలను మూసివేస్తామని, నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించమని స్పష్టం చేశారు. ఎలక్ర్టానిక్ వస్తువులకు అనుమతిలేదని, కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
పరీక్షా కేంద్రాల కోడ్, చిరునామా
1351, 8977- ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గూడూరు)
1854-నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, దూర్జటినగర్ (గూడూరు)
2403- కేకేసీ గ్రూప్ ఆఫ్ ఇన్‌ట్యూషన్, నగరిరోడ్డు (పుత్తూరు)
2444-సిద్ధార్ధ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నారాయణవనం రోడ్డు(పుత్తూరు)
8976-శ్రీవెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కార్వేటినగరంరోడ్డు (పుత్తూరు)
1862-అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, కరకంబాడిరోడ్డు (తిరుపతి)
4081-ఎస్వీకాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరకంబాడిరోడ్డు(తిరుపతి)
9676-ఎస్‌ఎస్ డిజిటల్ జోన్, పేరూరువద్ద, చంద్రగిరిరోడ్డు (తిరుపతి)
4437-శ్రీఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గోపాలపురం శ్రీకాళహస్తిరోడ్డు (రేణిగుంట)
8580- ఐయాన్ డిజిటల్ జోన్, రామిరెడ్డిపల్లె (తిరుపతి)
9105- ఐయాన్ డిజిటల్ జోన్, జూపార్కు సమీపంలో (తిరుపతి)

