ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నేటితో ముగిసిన విద్యా సంవత్సరం

ABN, First Publish Date - 2022-05-14T07:01:56+05:30

ఈ విద్యా సంవత్సరం శనివారంతో ముగియనుంది. విద్యార్థులకు ఈ నెల 6 నుంచి వేసవి సెలవులు ఇవ్వగా, ఉపాధ్యాయులు మాత్రం 20వ తేదీ వరకు విధులకు హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 విద్యాశాఖలో డిప్యుటేషన్లు రద్దు 

నేడు పాఠశాలల్లో రిపోర్టు 


చిత్తూరు (సెంట్రల్‌), మే 13: ఈ విద్యా సంవత్సరం శనివారంతో ముగియనుంది.  విద్యార్థులకు ఈ నెల 6 నుంచి వేసవి సెలవులు ఇవ్వగా, ఉపాధ్యాయులు మాత్రం 20వ తేదీ వరకు విధులకు హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తర్వాత వివిధ కారణాలతో ఆ తేదీని ఈనెల 15కు తగ్గించింది. 15న ఆదివారం కావడంతో 14వ తేది.. 2021-22 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులకు చివరి పనిదినం కానుంది. ఇదిలా ఉండగా విద్యాశాఖలో గతేడాది ఇచ్చిన డిప్యుటేషన్లను రద్దు చేయాలని విద్యాశాఖ కమిషనరు సురే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం వివిధ విభాగాలు, వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న వారి డిప్యుటేషన్లను శుక్రవారంతో రద్దు చేశారు. వీరిని ఆయా ఎంఈవోలు వెంటనే రిలీవ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఆయన.. చివరి పనిదినమైన శనివారం ప్రతి ఉపాధ్యాయుడు విధులకు ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, డైట్‌లో డిప్యుటేషన్లపై పనిచేసే ఉపాధ్యాయులకు విద్యాశాఖ మినహాయింపు ఇచ్చింది. ఇదిలా ఉండగా పాఠశాల హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు 2021-22 విద్యా సంవత్సరానికి ఎఫ్‌ఏ-1, ఎఫ్‌ఏ-2, ఎఫ్‌ఏ-3, ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2 పరీక్షలకు సంబంధించిన మార్కులు నమోదు చేయాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!