42 మండలాల్లో వర్షం
ABN, First Publish Date - 2022-05-14T06:31:33+05:30
నెల ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షం శుక్రవారం ఎడతెరిపి ఇచ్చింది.
చిత్తూరు కలెక్టరేట్, మే 13: నెల ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షం శుక్రవారం ఎడతెరిపి ఇచ్చింది. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 42 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కార్వేటి నగరంలో 11.4, నగరి 11.2, ఆర్‌సీ పురం 8.2, నాగలాపురం 7.6, పుత్తూరు 7.4, నిండ్ర 6.8, తిరుపతి రూరల్ 6.4, తిరుపతి అర్బన్ 5.6, ఐరాల 5.2, శ్రీకాళహస్తి 5 మి.మీ వర్షం కురవగా మిటిలిన 32 మండలాల్లో అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైంది.