ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వృద్ధులకు ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనం కల్పించండి

ABN, First Publish Date - 2022-05-14T07:18:52+05:30

వృద్ధులకు ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనం కల్పించండి అంటూ భక్తులు ఈవో ధర్మారెడ్డిని కోరారు.

భక్తులతో మాట్లాడుతున్న ధర్మారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆలయంలో సిబ్బంది నెట్టకుండా చూడండి

‘డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో’లో భక్తులు


తిరుమల, మే 13 (ఆంధ్రజ్యోతి): ‘వృద్ధులకు ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనం కల్పించండి. ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా ఆలయ బయోమెట్రిక్‌ నుంచి అనుమతిస్తే బాగుంటుంది. రూ.300 దర్శన టికెట్‌ తీసుకుని కుటుంబీకులతో వచ్చే వయసు పైబడినవారు శ్రీవారిని ఎలా దర్శించుకోవచ్చు’ అంటూ హైదరాబాద్‌కు చెందిన సుచిత్ర, యాదగిరి, ప్రభాకర్‌ అనే భక్తులు ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించారు. ‘వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ఆన్‌లైన్‌లో రోజుకు వెయ్యి మందికి టోకెన్లు కేటాయిస్తున్నాం. వీరు నిర్దేశిత స్లాట్‌లో వస్తే దక్షిణమాడ వీధిలోని పాయింట్‌ నుంచి దర్శనానికి అనుమతిస్తాం. అలాగే రూ.300 దర్శన టికెట్‌ పొంది కుటుంబీకులతో వచ్చే వృద్ధులనూ ఆలయ బయోమెట్రిక్‌ నుంచి అనుమతిస్తున్నాం’ అని ఈవో తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో భక్తులు ఫోన్‌ద్వారా నేరుగా ఈవోతో మాట్లాడారు. తమ సందేహాలు, సమస్యలు, సూచనలను తెలియజేయగా.. ఈవో ధర్మారెడ్డి వారికి బదులిచ్చారు. శ్రీవారి ఆలయంలో స్వామిని చూశామన్న ఆనందం కంటే అక్కడి సిబ్బంది నెట్టేశారనే బాధే అధికంగా ఉంటోందని మురళీకృష్ణ(చిత్తూరు) చెప్పగా.. భక్తులను దేవుళ్లుగా భావించి సేవలందించాలని సూచిస్తున్నామని.. ఇకపై ఇలా నెట్టకుండా ఆదేశిస్తామన్నారు. ఆన్‌లైన్‌ లక్కీడి్‌పలో ఒకే వ్యక్తికి తొమ్మిది సార్లు సుప్రభాతం లభించిందని, పరిశీలించి అందరికీ సేవ లభించేలా చర్యలు తీసుకోవాలని వెంకట్‌ (కాకినాడ) కోరారు. ఒకే వ్యక్తికి ఇన్ని సార్లు సేవ లభించిన అంశంపై విచారణ జరుపుతామన్నారు. తిరుమలలో గదులు లభించక ఇబ్బంది పడ్డామని వెంగళరావు(తెలంగాణ) తెలియజేయగా.. కొండపై 35వేల మందికి మాత్రమే బస ఉందని, ఇందులో దాదాపు 60 శాతం అడ్వాన్స్‌ బుకింగ్‌లో కేటాయిస్తున్నామని చెప్పారు. ఎస్వీబీసీలో ఆడియో, వీడియో సింక్‌ కావడం లేదంటూ విజయేంద్ర(హిందూపురం) ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్వీబీసీలో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కల్యాణాన్ని శని, ఆదివారాల్లోనూ ప్రసారం చేయాలని జోగిరెడ్డి(గుంటూరు) కోరగా.. ప్రయత్నిస్తామన్నారు. 


వారపు సేవల రద్దుపై.. 

వారపు సేవలను ఎందుకు రద్దు చేస్తున్నారని మస్తానయ్య(నెల్లూరు) ప్రశ్నించారు. ‘జీయంగార్లు, ఆగమ సలహామండలి, అర్చకుల నిర్ణయం మేరకు విశేష పర్వదినాల సమయంలో ఆర్జిత సేవలను రద్దు చేయడం జరుగుతోంది. కొవిడ్‌ సమయంలోనూ వీటిని రద్దు చేశాం. 365రోజుల్లో దాదాపు 450 ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో నిర్వహించే అభిషేకాల ద్వారా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా నివారించడానికి విశేషపూజ, సహస్రకలశాభిషేకం, వసంతోత్సవం వంటి ఆర్జిత సేవలను వార్షిక సేవలుగా మార్చాం. అష్టదళపాదపద్మారాధన సేవకు వంద మందిని మాత్రమే అనుమతిస్తారు. ఈసేవ నిర్వహించే సమయంలో దాదాపు ఏడువేల మందికి దర్శనం కల్పించవచ్చు. అలాగే తిరుప్పావడ సేవకు 60 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఈసేవ సమయంలో దాదాపు తొమ్మిదివేల మందికి దర్శనం చేయించవచ్చు. తోమాల, అర్చన తదితర సేవల సమయంలో ఉదయాస్తమాన సేవ భక్తులు జయ, విజయలను దాటి లోపలే ఉంటారు కాబట్టి సామాన్య భక్తులు కూడా ఆ సేవలను దర్శించే అవకాశం కలుగుతుంది’ అని ఈవో ఆర్జితసేవల గురించి వివరించారు. ప్రస్తుతం.. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూన్‌ 30వ తేదీ వరకు మాత్రమే అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!