-
-
Home » Andhra Pradesh » Chittoor » kuppam people gives power to chandrababu-NGTS-AndhraPradesh
-
కుప్పం ప్రజలు చంద్రబాబుకే పట్టం కడతారు
ABN , First Publish Date - 2022-05-14T06:25:27+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే కుప్పం ప్రజలు పట్టం కడతారని ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీడీపీ నేతలు
చిత్తూరు సిటీ, మే 13: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే కుప్పం ప్రజలు పట్టం కడతారని ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు కుప్పం పర్యటనపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను భయపెట్టి, బెదిరించి, డబ్బులు పంచడమే కాకుండా బయటకు రాకుండా గేట్లు వేసి సభలు జరిపేది వైసీపీ నేతలేనని విమర్శించారు. గడప గడపకూ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తూ, ఛీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలని తెలిపారు.

