కిలో టమోటా 80

ABN , First Publish Date - 2022-05-14T07:11:14+05:30 IST

గూడూరు మార్కెట్‌లో శుక్రవారం కిలో టమోటా రూ. 80 పలికింది.20 రోజుల క్రితం పది రూపాయలు పలికిన కిలో టమోటా పెరుగుతూ పెరుగుతూ మూడు రోజుల క్రితం రూ. 50కి చేరుకుంది.

కిలో టమోటా 80

గూడూరు, మే 13: గూడూరు మార్కెట్‌లో శుక్రవారం  కిలో టమోటా రూ. 80 పలికింది.20 రోజుల క్రితం పది రూపాయలు పలికిన కిలో టమోటా పెరుగుతూ  పెరుగుతూ మూడు రోజుల క్రితం రూ. 50కి చేరుకుంది. అక్కడనుంచి రోజూ పది రూపాయల చొప్పున పెరుగుతూ రూ. 80కి చేరింది. ఎండల తీవ్రతతో పాటు అకాలవర్షానికి పంట దిగుబడి తగ్గడంతో టమోటాలకు డిమాండ్‌ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. 

Read more