మొదలైన ‘పది’ మూల్యాంకనం
ABN, First Publish Date - 2022-05-14T07:09:28+05:30
పది పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారం చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొదలైంది.
జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తున్న దృశ్యం
చిత్తూరు (సెంట్రల్), మే 13: పది పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారం చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొదలైంది. తొలి రోజు కావడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అసిస్టెంట్ ఎగ్జామినర్లు స్పాట్‌లో పరీక్షల సహాయ కమిషనర్ ప్రభావతికి రిపోర్టు చేశారు. మధ్యాహ్నం చిత్తూరు, తిరుపతి డీఈవోలు పురుషోత్తం, శేఖర్ జవాబు పత్రాల స్ట్రాంగ్ రూంలను తెరిచారు. దాదాపు వెయ్యి మంది టీచర్లు పాల్గొన్న మూల్యాంకన ప్రక్రియలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.