-
-
Home » Andhra Pradesh » Chittoor » dont send jagary for making sara-NGTS-AndhraPradesh
-
సారా తయారీకి నల్లబెల్లం సరఫరా చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2022-05-14T06:23:45+05:30 IST
సారా తయారీకి నల్లబెల్లం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) డిస్ట్రిక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ మధుమోహన్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్‌ఈబీ డిస్ట్రిక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ మధుమోహన్‌రావు
చిత్తూరు సిటీ, మే13: సారా తయారీకి నల్లబెల్లం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) డిస్ట్రిక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ మధుమోహన్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 15 నాటికి రాష్ర్టాన్ని సారా రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో సారా ప్రభావం ఎక్కువగా ఉండే గ్రామాలను గుర్తించామన్నారు. సారా తయారీకి ముఖ్యమైన ముడిసరుకు నల్లబెల్లం అందుబాటులోకి రాకుండా ప్రభుత్వం నిబంధనలు జారీ చేసిందని పేర్కొన్నారు. ప్రతి బెల్లం వ్యాపారీ లైసెన్సు కలిగి ఉండి, క్రయ విక్రయాల వివరాలను ప్రతినెల ఒకటో తేదీలోపు సంబంధిత ఎస్‌ఈబీ స్టేషన్‌కు సమర్పించాలని తెలిపారు. సారా తయారీ కేంద్రాల వద్ద నల్లబెల్లం పట్టుబడితే సరఫరా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

