-
-
Home » Andhra Pradesh » Chittoor » Devotees came to the Gangama temple and visited the vendors-NGTS-AndhraPradesh
-
సారెల సందడి
ABN , First Publish Date - 2022-05-14T07:15:12+05:30 IST
తిరుపతి గంగ జాతర వేషాల్లో శుక్రవారం భక్తులు తోటివేషాన్ని ధరించి మొక్కులు తీర్చుకున్నారు.
తోటివేషంలో భక్తుల మొక్కులు
తిరుపతి, మే 13 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి గంగ జాతర వేషాల్లో శుక్రవారం భక్తులు తోటివేషాన్ని ధరించి మొక్కులు తీర్చుకున్నారు.ఎక్కువగా పిల్లలు ఒళ్లంతా బొగ్గుపొడి పూసుకుని తెల్లనామం సాది కనుబొమ్మలపైన చుక్కబొట్లు పెట్టుకుని నడుంచుట్టూ, తలకు వేపాకు మండలను కట్టుకుని హంగామాగా ఆలయానికి వచ్చారు. బూతు పాటలు పాడుకుంటూ వేశాలమ్మ గుడికెళ్లి, అక్కడినుంచి తాతయ్యగుంట గంగమ్మ గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.శుక్రవారం ఉదయం మేయర్ శిరీష దంపతులు గంగమ్మకు పట్టుచీర, సారె సమర్పించారు.అనంతరం కార్పొరేషన్ కార్యాలయం నుంచి కమిషనర్ అనుపమ అంజలితో పాటు ఇతర అధికారులు ఊరేగింపుగా ఆలయానికి వచ్చి సారె సమర్పించారు.పలువురు కార్పొరేటర్లు కూడా సారెను సమర్పించారు.శనివారం సాయంత్రం గంగమ్మకు టీటీడీ శేషవస్ర్తాలను అందజేయనుంది.
నేడు దొర వేషం
దొర వేషాన్ని కైకాల, చాకలి కులస్తులు మాత్రమే అనువంశికంగా వేస్తారు.దొర వేషాన్ని కైకాల వాళ్లు, మంత్రి వేషాన్ని రజకులు వేయనుండగా తక్కిన భక్తులు వివిధ వేషాల్లో అమ్మవారిని దర్శించుకుంటారు.


