విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-14T06:28:15+05:30 IST

సమయపాలన పాటించక విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
వైద్యసిబ్బందికి సూచనలిస్తున్న జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌

కలెక్టర్‌ హరినారాయణన్‌

బంగారుపాళ్యం, మే 13: సమయపాలన పాటించక విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ హెచ్చరించారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు - నేడు పనుల్లో భాగంగా జరుగుతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ సుశీల, ఎంపీడీవో విద్యారమ, డీఈ మునిచంద్రశేఖర్‌, ఏఈ పవన్‌, ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మురళి, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Read more