-
-
Home » Andhra Pradesh » Chittoor » Benefit to 3356 people in Fisheries Assurance Collector-NGTS-AndhraPradesh
-
‘మత్స్యకార భరోసా’లో 3,356మందికి లబ్ధి: కలెక్టర్
ABN , First Publish Date - 2022-05-14T07:22:42+05:30 IST
మత్స్యకార భరోసా కింద జిల్లాలో 3,356మందికి లబ్ధి చేకూరిందని కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు.
తిరుపతి, మే 13 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద జిల్లాలో 3,356మందికి లబ్ధి చేకూరిందని కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అర్హుల ఖాతాల్లోకి రూ.3.36కోట్లను జమ చేశారు. దీనిపై లబ్ధిదారులు, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీనివా్‌సనాయక్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

