-
-
Home » Andhra Pradesh » Chittoor » attack on pregnent lady-NGTS-AndhraPradesh
-
గర్భిణిపై దాడి
ABN , First Publish Date - 2022-05-14T05:57:32+05:30 IST
పలమనేరు మండలం టి.ఓడ్డూరు గ్రామంలో జరిగిన దాడిలో నవనీత అనే మహిళ గర్భస్రావానికి గురై ఆస్పత్రిలో చేరింది.
పలమనేరు, మే13 : పలమనేరు మండలం టి.ఓడ్డూరు గ్రామంలో జరిగిన దాడిలో నవనీత అనే మహిళ గర్భస్రావానికి గురై ఆస్పత్రిలో చేరింది. బాధితురాలి కథనం మేరకు..టి.ఒడ్డూరు గ్రామంలో శుక్రవారం తాగునీరు తీసుకెళుతున్న సునీతను ద్విచక్ర వాహనంలో వెళుతున్న వ్యక్తి ఢీకొన్నాడు. దీంతో సునీత అతడిని మందలించింది. దీంతో సుబ్రమణి, చుక్కమ్మ, వరాలు, బాబు, వెంకటేసు, రాఘవ, కేశవులు సునీతపై దాడికి దిగారు. అంతలో సునీత చెల్లెలు నవనీత అడ్డువెళ్లడంతో ప్రత్యర్థులు నవనీతపై విచక్షణా రహితంగా దాడిచేయడంతో ఆమె గర్భస్రావానికి గురైంది. పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

