ఏఎస్పీ శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ
ABN, First Publish Date - 2022-05-14T06:30:16+05:30
జిల్లా అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్)గా శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు తీసుకుంటున్న ఏఎస్పీ శ్రీనివాసరావు
చిత్తూరు, మే 13: జిల్లా అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్)గా శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏఎస్సీగా ఉన్న డీఎన్ మహేష్ బదిలీపై వెళ్లారు. విజయవాడలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు బదిలీపై చిత్తూరు ఏఎస్పీగా వచ్చారు. ఈయన బాధ్యతలు తీసుకున్న అనంతరం మర్యాదపూర్వకంగా ఎస్పీ రిషాంత్‌రెడ్డిని కలిశారు. 2010వ బ్యాచ్‌కు చెందిన ఈయన మెదక్, మచిలీపట్నం డీఎస్పీగా పనిచేశారు.