ఇంటర్‌ పరీక్షలకు 1,366 మంది గైర్హాజరు

ABN , First Publish Date - 2022-05-14T07:22:02+05:30 IST

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు 1,366మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో వై.వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు 1,366 మంది గైర్హాజరు

తిరుపతి(విద్య), మే 13: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు 1,366మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో వై.వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈపరీక్షలకు జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో 37,025మందికిగాను 35,659మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదుకాలేదని తెలిపారు.

Read more