-
-
Home » Andhra Pradesh » Chandrababu YCP-MRGS-AndhraPradesh
-
APలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-05-12T23:06:46+05:30 IST
ఏపీలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన

కుప్పం: ఏపీలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కనీసం సీఎం కాన్వాయ్కి కార్లు కూడా పెట్టుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరమన్నారు. బిల్లుల చెల్లింపులు జరపకపోతే అధికారులు కార్లు ఎలా ఏర్పాటు చేస్తారన్నారు. బిల్లులు రాక యజమానులు పడే బాధలకు ఎవరిది బాధ్యత? అని ప్రశ్నించారు. వ్యవస్థల నిర్వీర్యంతో అధికారులు, ఉద్యోగులు కూడా.. తీవ్ర ఒత్తిడికి లోనై తప్పులు చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అసలు ప్రభుత్వం తెచ్చిన అప్పులు.. పెండింగ్లో ఉన్న బిల్లుల అంశంపై వాస్తవాలు వెల్లడించగలరా? అని చంద్రబాబు ప్రశ్నించారు.