ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రాజధాని గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయింది: GVL

ABN, First Publish Date - 2022-05-14T19:41:15+05:30

రాజధాని గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం రాజధాని గ్రామాల్లో ఎంపీ పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: రాజధాని గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL narasimha rao) అన్నారు. శనివారం రాజధాని గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. అనంతరం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పనులను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలోనే 80, 90 శాతం పనులు అయిపోయినా ఇప్పుడు 10శాతం పనులు కూడా పూర్తి కాలేదని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అప్పగించకుండా వదిలేశారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని ఎంపీ చెప్పారు. జగన్ ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని వ్యాఖ్యానించారు. రవాణా మార్గం లేక కేంద్ర సంస్థలు కొన్ని నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. రాజకీయ కారణాలతో రాష్ట్ర అభివృద్ధిని ఆపడం సరికాదన్నారు. పనులు చేపట్టాలని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు లేఖ రాసినట్లు చెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా.. రైతులకు అండగా ఉంటామని జీవీఎల్‌ స్పష్టం చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!