ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

YCP ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: BJP leader

ABN, First Publish Date - 2022-05-04T17:49:02+05:30

బీజేపీ నేతలను హెచ్చరిస్తూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విజయవాడ: బీజేపీ నేతలను హెచ్చరిస్తూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఆయన క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడలో జె.యన్.టి.యూకి చెందిన స్థలం కబ్జా కాకూడదనేది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ద్వారపూడి మాట్లాడారని అన్నారు. ‘‘ముద్దాయి సీఎంగా ఉంటే... మీరంతా దొంగల ముఠాగా ఉన్నారు. మీదొక చిన్న ప్రాంతీయ పార్టీ.. మందు, పలావుతో నడిపే పార్టీ’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.


ముస్లింలు తలచుకుంటే మీరెంత అని అనడం వెనక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ద్వారంపూడి వ్యాఖ్యలకు ముస్లిం పెద్దలే ఆశ్చర్యపోయారన్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు చాలు... ద్వారంపూడికి బుద్ది చెప్పడానికని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అక్రమ దందాపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను దోవుకుంటున్న ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలని బిట్ర శివన్నారాయణ డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!