-
-
Home » Andhra Pradesh » BJP leader Bhanuprakash Reddy legal notices to TTD-MRGS-AndhraPradesh
-
TTDకి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి లీగల్ నోటీసులు
ABN , First Publish Date - 2022-05-03T20:53:39+05:30 IST
TTDకి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. తిరుమలలో కాటేజీలా కోసం భూమి కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిని సరిదిద్దుకోవాలని చెప్పినా..

తిరుపతి: TTDకి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. తిరుమలలో కాటేజీలా కోసం భూమి కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిని సరిదిద్దుకోవాలని చెప్పినా పాలక మండలి పట్టించుకోవడం లేదని నోటీసులు ఇచ్చారు. ఇద్దరు టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుల పేర్లతో రూ. 25 లక్షలకే తిరుమలలో స్థలాలు కేటాయించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు.బహిరంగ టెండర్లో స్థలం విలువ రూ. 12 కోట్లు పలుకుతుందని చెప్పారు. టీటీడీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని భానుప్రకాష్‌రెడ్డి తెలిపారు.