ఉపాధి కూలీలకు యాప్ ద్వారా హాజరు: కేంద్రం
ABN, First Publish Date - 2022-05-14T08:18:37+05:30
ఉపాధి కూలీలకు యాప్ ద్వారా హాజరు: కేంద్రం
అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో ఈ నెల 16 నుంచి యాప్ ద్వారా హాజరు నమోదును తప్పనిసరి చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మాన్యువల్‌గా హాజరు నమోదు చేయరాదని పేర్కొంది. ప్రతి 20 మంది అంతకంటే ఎక్కువ మంది కూలీలకు వేస్తున్న మస్టర్లు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్‌ఎంఎంఎ్‌స) యాప్ ద్వారా వేస్తేనే వారికి వేతనాలు చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేసింది.