నకిలీ ఎరువుల గోదాములపై దాడులు
ABN, First Publish Date - 2022-05-14T09:39:23+05:30
నకిలీ ఎరువుల గోదాములపై దాడులు
నకిలీ ఎరువుల తయారీ కేంద్రాలపై వ్యవసాయశాఖ వరుస దాడులు నిర్వహిస్తోంది. గన్నవరం మండలం సూరంపల్లి, విజయవాడ శివారు జగ్గంపూడిలోనూ నకిలీ ఎరువుల తయారీ గోదాముల్లో వ్యవసాయశాఖ శుక్రవారం తనిఖీలు చేసింది. నకిలీ ఎరువుల ముడిపదార్థాల నమూనాలు, కొన్ని పత్రాలను సేకరించి విచారణకు ఉపక్రమించింది. దీనికి సంబంధించి ఒక బయో కంపెనీ యజమాని పరారీలో ఉన్నట్లు గుర్తించారు.