ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Shocking : పెళ్లంటే పరేషాన్‌.. ఒక్కసారిగా డబుల్..!

ABN, First Publish Date - 2022-05-14T12:39:01+05:30

పెళ్లంటే పరేషాన్‌.. ఒక్కసారిగా డబుల్..!

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • ఆగిరిపల్లి శోభనాచలుని ఆలయంలో 
  • పెళ్లి రుసుము.. రూ.5 వేలకు పెంపు 

ఏలూరు : పేదవాడి పెళ్లి (Marriage) కూడా పరేషాన్‌గా మారింది. పేదలు, మధ్య తరగతి వర్గాలు లక్షలు వెచ్చించి కల్యాణ మండపాలు అద్దెకు తీసుకోలేరు. వీరంతా వివాహాలకు గుడినే ఆశ్రయిస్తుంటారు. కొందరు ఫలానా ఆలయంలో పెళ్లిళ్లు చేస్తామని మొక్కుకుని భగవంతుడి సన్నిధిలో ఈ తంతు నిర్వహిస్తారు. ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం పెళ్లిళ్లకు ప్రసిద్ది. ఆలయ ఆవరణ విశాలంగా ఉండడంతో చాలా మంది దీనిని వేదికగా చేసుంటున్నారు. ఇలా పెళ్లి జరుపుకున్నందుకు ఆలయానికి రూ.2,500 చెల్లించేవారు.


తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుని పేదలు సంతృప్తి చెందేవారు. తాజాగా ఈ వివాహాల రుసుమును అమాంతం రెట్టింపంటే రూ.5,000 చేయడంతో పేదలను దేవుడి కి దూరం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఆలయం వద్ద పెళ్లి భోజనాలు ఏర్పాటు చేసుకుంటే అదనంగా మరో రూ.5,000 చెల్లించాల్సిందేనని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేయడం తీవ్ర విమర్శలపాలవుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో పెళ్లి చేసుకుంటే వెయ్యి రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అటువంటిది ఈ ఆల యంలో ఒక్క సారిగా ఐదు వేలు చేయడం.. ఆలయాన్ని కూడా వ్యాపారమయంగా చేయడమేనని ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. - ఆగిరిపలి.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!