ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Asani cyclone effect.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..

ABN, First Publish Date - 2022-05-11T20:00:46+05:30

Asani తుఫాన్ దిశ మార్చుకుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Amaravathi: Asani తుఫాన్ దిశ మార్చుకుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో అనేక జిల్లాలు తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాల యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడంతోపాటు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. తుఫాన్ ప్రభావం భారీగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. క్రమ క్రమంగా బలహీనపడడంతో కొంత వరకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


ఇవాళ మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే కొద్ది సేపటి క్రితం తన దిశ మార్చుకున్న అసాని తుఫాన్ నరసాపురం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రతీర ప్రాంతంలో నివశించే వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, రైళ్లు, విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అఢికారులు ప్రకటించారు.


తుఫాన్ ప్రభావం కారణంగా రైతులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. వరి, ఉద్యానవనం, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతినే అవకాశముంది. చేతికొచ్చే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తమను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అసాని తుఫాన్ ప్రభావంపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా స్వీయ జాగ్రత్తలు పాటించాలని, బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!