మద్యం, పోర్న్ వీడియోలు నిషేధించాలి: మహిళా సంఘాలు

ABN , First Publish Date - 2022-05-15T01:17:41+05:30 IST

మద్యం, పోర్న్ వీడియోలు నిషేధించాలి: మహిళా సంఘాలు

మద్యం, పోర్న్ వీడియోలు నిషేధించాలి: మహిళా సంఘాలు

విజయవాడ: మహిళలపై జరిగే అత్యాచారాలు అరికట్టాలని లెనిన్ సెంటర్ లో మహిళా సంఘాల నిరసనకు దిగారు. సంతకాల సేకరణ, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. అత్యాచారాలను నిరోధించేందుకు రాష్ట్రప్రభుత్వం సమగ్ర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. మద్యం, పోర్న్ వీడియోలు నిషేధించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని, గంజాయి అమ్మకాలను అరికట్టాలన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా మహిళపై అత్యాచారం జరిగితే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం సమగ్ర చట్టం తెచ్చే వరకు దశలవారీ ఉద్యమం చేస్తూనే ఉంటామని మహిళా సంఘాలు హెచ్చరించాయి. 

Read more