ఆ జాబితాలో ఏపీ ముందజలో ఉంది: పట్టాభి

ABN , First Publish Date - 2022-05-14T21:25:01+05:30 IST

ఆ జాబితాలో ఏపీ ముందజలో ఉంది: పట్టాభి

ఆ జాబితాలో ఏపీ ముందజలో ఉంది: పట్టాభి

అమరావతి: పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదట అని టీడీపీ నేత పట్టాభి అన్నారు. జగనన్న కాలనీలతో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.4,500 కోట్ల ఖర్చు అన్నారు. కనెక్షన్లపై సీఎంతో అధికారులు చెప్పినా డబ్బులు లేవన్నారట అని చెప్పారు. విద్యుత్ చార్జీలు పెంచి జనాలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోతే వారెక్కడ ఉండాలని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా కంపెనీలకు ఏపీ భారీ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. విద్యుత్ బకాయిల జాబితాలో అందరికంటే ముందంజలో ఏపీ ఉందన్నారు. 

Read more