ఇసుక మైనింగ్‌ను ఏపీ ప్రభుత్వం జేపీ వెంచర్స్‌కు ఇచ్చింది: గనులశాఖ డైరెక్టర్

ABN , First Publish Date - 2022-05-15T02:55:21+05:30 IST

ఇసుక మైనింగ్‌ను ఏపీ ప్రభుత్వం జేపీ వెంచర్స్‌కు ఇచ్చింది: గనులశాఖ డైరెక్టర్

ఇసుక మైనింగ్‌ను ఏపీ ప్రభుత్వం జేపీ వెంచర్స్‌కు ఇచ్చింది: గనులశాఖ డైరెక్టర్

అమరావతి: ఇసుక మైనింగ్‌ను ఏపీ ప్రభుత్వం జేపీ వెంచర్స్‌కు ఇచ్చిందని గనులశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జేపీ వెంచర్స్ ఎవరికైనా సబ్ లీజ్‌కు ఇవ్వవచ్చన్నారు. టర్న్‌కీ సంస్థ సబ్ లీజ్‌ తీసుకుంటే ప్రభుత్వానికేం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. అధికారికంగా జేపీ వెంచర్స్‌తోనే ఏపీఎండీసీ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు కోటీ 70 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరగినట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి జేపీ వెంచర్స్ రూ.668 కోట్లు చెల్లించిందని ఆయన తెలిపారు. ఇసుక తవ్వకాల్లో ఎక్కడా అక్రమాలు లేవన్నారు. గనులశాఖ, ఎస్ఈబీ, పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు. అక్రమాలపై ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని గనులశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. 

Read more