ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

AP News : మరో 2 వేల కోట్ల అప్పు..

ABN, First Publish Date - 2022-05-14T08:07:12+05:30

AP News : మరో 2 వేల కోట్ల అప్పు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • 17న ఆర్‌బీఐ వేలంలో తేనున్న ప్రభుత్వం
  • కొత్త రుణానికి అనుమతి ఇవ్వనని
  • ఇటీవల భీష్మించుకున్న కేంద్రం
  • రాజకీయ ఒత్తిడితో ఎట్టకేలకు ఓకే
  • ఈ ఏడాది అనుమతి 28 వేల కోట్లకే
  • ఇప్పటికే 9,390 కోట్ల రుణం
  • ఈ లెక్కన 4 నెలలకే మొత్తం తేవడం ఖాయం
  • ఆనక మళ్లీ కేంద్రం చుట్టూ ప్రదక్షిణలే!

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): వచ్చే మంగళవారం మే 17న ఆర్‌బీఐ నిర్వహించే సెక్యూరిటీ వేలంలో పాల్గొని మరో రూ.2 వేల కోట్ల అప్పు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 10న జరిగిన వేలంలో రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల 17 వరకు అంటే 47 రోజుల్లో సర్కారు రూ.9,390 కోట్లు అప్పు తెచ్చింది. జగన్‌ ప్రభుత్వం ఈ మూడేళ్లలో చేసిన అప్పుల కారణంగా కొత్త అప్పులకు అనుమతిచ్చేది లేదని భీష్మించిన కేంద్రం.. ఎట్టకేలకు రాజకీయ ఒత్తిడికి తలొగ్గింది. దొంగ అప్పుల విషయంలో మన రాష్ట్రానికి ఏ మాత్రం తీసిపోకుండా తెలంగాణ కూడా అనేక మార్గాల్లో అప్పులు చేస్తోంది.


అయితే తెలంగాణకు ఇప్పటి వరకు కొత్త అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఆంధ్రకు మాత్రం సరేనంది. దీనిపై తెలంగాణ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 వేల కోట్లు అప్పులు కావాలని జగన్‌ ప్రభుత్వం కోరగా.. కేంద్రం మాత్రం రూ.28 వేల కోట్లకే అనుమతించింది. అనుమతి వచ్చిన వారంలోనే రూ.5 వేల కోట్ల అప్పులు చేయడం చూస్తుంటే అప్పులపై జగన్‌ సర్కారు ఏ విధంగా ఆధారపడుతోందో అర్థమవుతోంది. నెలకు రూ.5-6 వేల కోట్లు అప్పులు తెస్తే గానీ రాష్ట్రంలో గడవని పరిస్థితి. ఈ నెల 17న రూ.2 వేల కోట్లు అప్పులు తెచ్చిన తర్వాత ఈ నెల పూర్తవడానికి మరో 13 రోజులు ఉన్నందున ఇంకో రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చే అవకాశం కనిపిస్తోంది.


కేంద్రం 12 నెలల పాటు వాడుకునేందుకు రూ.28 వేల కోట్లకు అనుమతిస్తే.. సర్కారు నాలుగు నెలల్లోనే ఆ మొత్తాన్ని వాడుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత రాష్ట్రాన్ని నడపడానికి అదనపు అప్పులు కావాలంటూ కేంద్రం చుట్టూ మళ్లీ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఈలోపు బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తేవడానికి అవసరమైన జీవోల జారీకి, చట్ట సవరణలకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాల నుంచి రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!