వాటా.. వార్‌

ABN , First Publish Date - 2022-11-08T00:34:27+05:30 IST

పంపకాల్లో తేడా వచ్చింది. విచక్షణ కోల్పోయి ఒకరినొకరు దూషించుకున్నారు. ఒకరి బండారం మరొకరు బయట పెట్టుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో పంపకాల విషయంలో ఎంపీడీఓ, ఏపీఓ మధ్య సోమవారం మధ్యాహం జరిగిన ఘర్షణ పట్టణంలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. విడపనకల్లు మండలంలో ఉపాధి హామీ పనుల నేం బోర్డులు ఏర్పా టు చేసేందుకు రూ.7 లక్షలు నిధులు వచ్చాయి. కానీ నేం బోర్డులను ఎక్కడా ఏర్పాటు చేయలేదు

వాటా.. వార్‌

ఎంపీడీఓ, ఏపీఓ వాగ్వాదం

విడపనకల్లు, నవంబరు 7: పంపకాల్లో తేడా వచ్చింది. విచక్షణ కోల్పోయి ఒకరినొకరు దూషించుకున్నారు. ఒకరి బండారం మరొకరు బయట పెట్టుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో పంపకాల విషయంలో ఎంపీడీఓ, ఏపీఓ మధ్య సోమవారం మధ్యాహం జరిగిన ఘర్షణ పట్టణంలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. విడపనకల్లు మండలంలో ఉపాధి హామీ పనుల నేం బోర్డులు ఏర్పా టు చేసేందుకు రూ.7 లక్షలు నిధులు వచ్చాయి. కానీ నేం బోర్డులను ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కమ్యూనిటీ ఇంజనీరు, ఎంపీడీఓ కలిసి, ఏపీఓకి తెలియకుండా రూ.5 లక్షలు డ్రా చేశారని సమాచారం. తనకు తెలియకుండా రూ.5 లక్షలు ఎలా డ్రా చేశారని ఎంపీడీఓను ఏపీఓ గోవిందు ప్రశ్నించాడు. దీంతో ఎంపీడీఓ స్పందిస్తూ.. ‘నేను డ్రా చేయలేదు. మీ కమ్యూనిటీ ఇంజనీరు.. నీవు కలిసి డ్రా చేశారు..’ అన్నట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా ‘డ్రా చేసిన మొత్తంలో 50 శాతం అడిగావు కదా?’ అని ఏపీఓను నిలదీశారని సమాచారం. ఈ క్రమంలో మాటా మాట పెరిగి ఎంపీడీఓ బూతు పురాణం అందుకున్నారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లిందని వారు తెలిపారు. కమ్యూనిటీ ఇంజనీరు వెంకటేశులు, ఎంపీడీఓ శ్రీనివాసులు కలిసి తనను పక్కన పెట్టి ఉపాధిహామీ పనుల్లో ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏపీఓ గోవిందు కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయాడని తెలిపారు. ‘నిన్ను సరెండర్‌ చేస్తా.. ఇక్కడ నాకు పనికిరావు..’ అని ఎంపీడీఓ తనను బెదిరించారని ఏపీఓ తెలిపారు. రూ.5 లక్షలు డ్రా చేయలేదని, తనకు తెలియకుండా రూ.2 లక్షలు డ్రా చేశారని ఏపీఓ అన్నారు. ఈ విషయం అడిగినందుకు తనను సరెండర్‌ చేస్తానని ఎంపీడీఓ బెదిరిస్తున్నాడని ఆరోపించారు.

Updated Date - 2022-11-08T00:34:27+05:30 IST

Read more