ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

గవర్నర్‌ పర్యటనలో లోటుపాట్లు ఉండరాదు

ABN, First Publish Date - 2022-05-14T05:57:10+05:30

రాష్ట్ర గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన జిల్లా పర్యటనలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు.

విద్యుతదీప కాంతుల్లో ఎనటీఆర్‌ ఆడిటోరియం
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి

అనంతపురం సెంట్రల్‌, మే 13: రాష్ట్ర గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన జిల్లా పర్యటనలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించే జేఎనటీయూ 12వ స్నాతకోత్సవానికి గవర్నర్‌ హాజరుకానున్న నేపథ్యంలో జేఎనటీయూలోని ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించారు. గవర్నర్‌కు అధికారిక స్వాగతం, కాన్వాయ్‌ ప్రవేశం మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఏర్పాట్ల పర్యవేక్షణలో కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌, జేఎనటీయూ వీసీ రంగజనార్దన, రిజిస్ర్టార్‌ శశిధర్‌, రెక్టార్‌ విజయకుమార్‌, ఆర్డీఓలు మధుసూదన, నిశాంతరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


గవర్నర్‌ పర్యటన షెడ్యూల్‌ ఇలా...

రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన శనివారం ఉద యం ప్రత్యేక హెలీకాప్టర్‌లో 11.50 గంటలకు అనంతపురం జేఎనటీయూ క్యాంప్‌సలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి గెస్ట్‌హౌ్‌సకు చేరుకుని ఎనటీఆర్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవ కార్యక్రమానికి 12.10 గంటలకు హాజరవుతారు. 2.05 గంటల నుంచి 2.35 గంటల వరకూ గెస్ట్‌హౌ్‌సలో భోజన కార్యక్రమం. అనంతరం 2.45 గంటలకు జేఎనటీయూలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుని ప్రత్యేక హెలీకాప్టర్‌ ద్వారా బయల్దేరి వెళ్తారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!