‘గడప గడప’కూ సమస్యే

ABN , First Publish Date - 2022-05-14T06:14:53+05:30 IST

తంగేడుకుంట పంచాయతీ లింగావారిపల్లిలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శుక్రవారం చేపట్టారు.

‘గడప గడప’కూ సమస్యే
పింఛన కోసం చేతులు జోడించి ఎమ్మెల్యేను వేడుకుంటున్న గౌరమ్మ

ఎమ్మెల్యే వద్ద ఏకరవు పెట్టిన ప్రజలు

ఓబుళదేవరచెరువు, మే 13 : తంగేడుకుంట పంచాయతీ లింగావారిపల్లిలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శుక్రవారం చేపట్టారు. ప్రతి ఇంటి వారు తమతమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వద్ద ఏకరువు పెట్టారు.  లింగాలవారిపల్లికి చెందిన మద్దెల గౌరమ్మ మాట్లాడుతూ.. ‘ సార్‌ నా భర్త చనిపోయి సంవత్సరైంది. ఇంతవరకు నాకు ఫించను రాలేదు. ఒంటరిగా ఉంటున్నా. వీటికి తోడు కడుపులో గడ్డ ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నా. వైద్య, బస్సు చార్జీలకు కూడా ఇబ్బంది పడుతున్నా. పింఛను ఇప్పించండి సారూ... ’ అని చేతులు జోడించి వేడుకొంది. ఇలా  ఫించన్లు, పక్కా గృహాలు, శోత్రియం భూములకు తదితర వాటిపై ప్రజలు ఆయన వద్ద వాపోయారు. ఎమ్మెల్యే అధికారులతో ఈ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించటం.. అధికారులు ఎమ్మెల్యే ముందు ఊకొట్టడం.. తర్వాత వారు పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందని పలువురు లబ్ధిదారులు వాపోయారు.

Read more