-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Strive to strengthen TDP-NGTS-AndhraPradesh
-
టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
ABN , First Publish Date - 2022-05-14T06:09:59+05:30 IST
తెలుగుదేశంపార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతానికి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి పేర్కొన్నారు.
- ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి
గార్లదిన్నె, మే 13: తెలుగుదేశంపార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతానికి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పంచాయతీలను రెండు క్లస్టర్లుగా విభజించి ఇనర్జులను నియమించారు. క్లస్టర్-1కు మర్తాడు ఆవుల శ్రీనివాసులు, క్లస్టర్-2కు కేశవాపురం ఆంజనేయులును నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. తమపై నమ్మకం ఉంచి తమను క్లస్టర్ ఇనచార్జులుగా నియమించినందుకు ముంటిమడుగు కేశవరెడ్డిని వారు సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు ఆవుల కిష్టయ్య, బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య, మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్, ఉపసర్పంచు వీరనారప్ప, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి బూడిద కిష్ట, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు అనిఫ్, వార్డు సభ్యులు లక్ష్మిపతి, రామాంజి, శంకర్, వీరాంజి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

