-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Strengthen the BJP-NGTS-AndhraPradesh
-
బీజేపీని బలోపేతం చేయండి
ABN , First Publish Date - 2022-05-14T06:13:07+05:30 IST
గ్రామ స్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ సూచిం చారు.
జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్
పుట్టపర్తి, మే 13 : గ్రామ స్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ సూచిం చారు. శుక్రవారం స్థానిక ఓ ప్రవేట్ హోటల్లో నిర్వహించిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా ప్రచారం చేస్తోందని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రంలో జరుగుచున్న భూకబ్జాలపై ఇతర పార్టీలు వారు స్పందిస్తున్నారని, పార్టీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉజ్వల ఫౌండేషన కాటేజీల కబ్జాలపై పత్రికల్లో వస్తున్నా ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నించకుంటే ప్రజలు తమను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్‌రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు లాయర్ హరికృష్ణ, కత్తిరాజారెడ్డి, బాలాగంగాధర్, కొండమరాజు, సునీల్‌వైట్ల, జ్యోతిప్రసాద్ పాల్గొన్నారు.

