గడపగడప వద్ద నిలదీయండి
ABN, First Publish Date - 2022-05-14T05:46:26+05:30
మూడేళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారని గడపగడప వద్ద వైసీపీ నాయకులను నిలదీయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి ప్రజలకు సూచించారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం
కళ్యాణదుర్గం, మే 13: మూడేళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారని గడపగడప వద్ద వైసీపీ నాయకులను నిలదీయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి ప్రజలకు సూచించారు. శుక్రవారం తన వ్యక్తిగత కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం మంజూరుచేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోందని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో గడపగడపకు వైసీపీ పేరుతో ప్రచారం నిర్వహిస్తే ప్రజలు ఎక్కడికక్కడే నిలదీయాలని సూచించారు. సీఎం జగన్ హయంలో మోసం తప్పా ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని స్పష్టం చేశారు. కరువు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సురెన్స్, డ్రిప్, స్ర్పింక్లర్లు, సబ్సిడీ పనిముట్లు ఒక్కరైతుకు కూడా అందిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. నిబంధనల పేరుతో రేషన్, పింఛన్ కట్‌చేసి పేదల ఉసురుతీసింది వాస్తవం కాదానని ప్రశ్నించారు. ఇష్టా రాజ్యంగా ధరలు పెంచుతూ సామాన్య ప్రజల జీవనం అతలాకుతలంగా మారిందన్నారు. గడపగడప కార్యక్రమాన్ని పోలీసుల అండతో నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఈసమావేశంలో నాయకులు ఆర్జీ శివశంకర్, మారుతిచౌదరి, రాయల శ్రీనివాసులు, గోవిందరెడ్డి, డీకే రా మాంజనేయులు, గోళ్లరాము, కొల్లాపురప్ప, నారాయణ, రం గప్ప, రామన్న పాల్గొన్నారు.