AP News: శ్రీసత్యసాయి జిల్లా: ఓబులదేవర చెరువులో రేషన్ డీలర్ మోసం

ABN , First Publish Date - 2022-11-07T15:47:09+05:30 IST

సత్యసాయి జిల్లా: ఓబులదేవర చెరువు మండలానికి చెందిన ఓ రేషన్ డీలర్ భారీ మోసానికి పాల్పడుతున్నాడు.

AP News: శ్రీసత్యసాయి జిల్లా: ఓబులదేవర చెరువులో రేషన్ డీలర్ మోసం

శ్రీసత్యసాయి జిల్లా: ఓబులదేవర చెరువు మండలానికి చెందిన ఓ రేషన్ డీలర్ భారీ మోసానికి పాల్పడుతున్నాడు. వినియోగదారులకు

అందించే బియ్యం తూకాల్లో మోసం చేస్తున్నాడు. ఒక్కో రేషన్ కార్డు మీద కిలో బియ్యం కోత విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇదేంటని అడిగితే ఒక్కో రేషన్ కార్డు మీద కిలో బియ్యం కోత రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెబుతున్నాడు. రేషన్ డీలర్ జబీవుల్లాపై ఇంతకుముందు కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. అయినా రెవెన్యూ, పౌరసంబంధాల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్ళలు వస్తున్నాయి. కొందరికి మాత్రం సరుకులు అందించి స్టాక్ అయిపోయిందని చెబుతుంటాడని వినియోగదారులు అంటున్నారు. వైసీపీ నాయకుడు కావడంతో అధికారులు కూడా చర్యలు తీసుకోవడంలేదని తెలుస్తోంది.

Updated Date - 2022-11-07T15:47:12+05:30 IST

Read more